
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పట్టుబడిన రూ.37 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. వీటికి సంబంధించిన వివరాలను మంగళవారం ఎక్సైజ్ భవన్ లో అధికారులు ప్రకటించారు. 15 జిల్లాల్లో 1030 కేసుల్లో రికవరీ చేసిన రూ.37 కోట్ల విలువ చేసే గంజాయి, డ్రగ్స్‌ను కాల్చి వేశారు. ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో రికార్డు స్థాయిలో గంజాయిని కాల్చివేశారు. ఇప్పటి వరకు 847 గంజాయి మొక్కలు, 24,690 కిలోల గంజాయి, 172 కిలోల హాష్ ఆయిల్, 4 కిలోల గంజాయి చాక్లెట్లు, 155 కిలోల ఓపిఎం, 518 గ్రాముల ఎండీఎంఏ, 326 కిలోల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్, 97 కిలోల ఎస్టేసీ పిల్స్, 6 కిలోల కొకైన్, 223 కిలోల అల్పోజోలం, 106 కిలోల డైజోపామ్ ను దహనం చేశారు.