ఆదివారం(నవంబర్ 17) హైదరాబాద్‌లో పలు చోట్ల డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు జరిపారు. సికింద్రాబాద్, సీతాఫల్ మండి, ఉప్పల్, రామంతాపూర్ పరిధిలోని మెడికల్ అండ్ జనరల్ షాపులపై ఈ దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇమ్యూనిటీ బూస్టర్లు, కంటి సంబందిత ఆయింట్మెంట్లు, కాస్మెటిక్స్ సహా 45 రకాల డ్రగ్స్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
గాయత్రి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌లో గడువు ముడిసిన మెడిసిన్ అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని సీజ్ చేసి యజమానికి నోటీసులు ఇచ్చారు. గడువు ముగిసిన మందులు, నకిలీ మెడిసిన్స్, అనుమతి లేని మందుల విక్రయాలు సాగించే వారిపై కఠిన చర్యలు అధికారులు హెచ్చరించారు.
ALSO READ | సికింద్రాబాద్‌లో 1500 కేజీల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం