హైదరాబాద్ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల దగ్గర కేజిన్నర గంజాయి

హైదరాబాద్ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల దగ్గర కేజిన్నర గంజాయి

హైదరాబాద్ లోని కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ హాస్టల్ లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. కెపిహెచ్బి కాలనీ ప్రాంతంలోని మణికంఠ పీజీ హాస్టల్లో ఉండి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న నలుగురు యువకులు గంజాయి అమ్ముతుండగా బాలానగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. వారి హాస్టల్ రూంలో 1600 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితోపాటు 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ | హైడ్రా తరహాలో.. హైదరాబాద్‍లో ఫుట్‌పాత్‌లపై షాపులు నేలమట్టం