ఫోన్​ లో డ్రగ్స్​ ఆర్డర్​... ముగ్గురు అరెస్ట్​

ఫోన్​ లో డ్రగ్స్​ ఆర్డర్​... ముగ్గురు అరెస్ట్​

హైదరాబాద్ సిటీ, వెలుగు : ఫోన్​లో ఆర్డర్​తీసు కుని డ్రగ్స్​సరఫరా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.  గోల్కొండ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ పీఎస్​ పరిధిలోని షేక్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌, టోలీచౌక్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల్లో ఫోన్​లో ఆర్డర్​ తీసుకుని డ్రగ్స్​సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎస్టీఎఫ్​సీఐ టీమ్ ​మంగళవారం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ కారులో యువతి, యువకుడు వెయిట్​ చేస్తుండగా ఒకరు టూ వీలర్​పై వచ్చి ఓ ప్యాకెట్‌‌‌‌‌‌‌‌ను కారులో ఉన్న వ్యక్తులకు ఇచ్చాడు. 

గమనించిన ఎస్టీఎఫ్ వారిని తనిఖీ చేయగా టూ వీలర్​పై వచ్చిన వ్యక్తి వద్ద కిలో గంజాయి దొరకింది. కారులో చూడగా 1.700 కిలోల గంజాయి,11గ్రాముల ఎండీఎంఏ, 3 ఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీ బ్లాస్ట్స్​ దొరికాయి. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్లు చాలా కాలంగా ఫోన్ కాల్స్ ద్వారా దందా చేస్తున్నట్టు గుర్తించారు.