ఆలివ్ బిస్ట్రో పబ్​లో డ్రగ్స్ కలకలం .. 20 మందికి డ్రగ్​ టెస్టులు

ఆలివ్ బిస్ట్రో పబ్​లో డ్రగ్స్ కలకలం .. 20 మందికి డ్రగ్​ టెస్టులు

మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ ఐటీ కారిడార్​లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ పబ్​లో మాదాపూర్​ పోలీసులు పలువురికి డ్రగ్స్ టెస్టులు చేయగా, ఒకరికి పాజిటివ్ వచ్చింది. జూబ్లీహిల్స్​లోని ఆలివ్ బిస్ట్రో పబ్​లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. పబ్​లోని 20 మందికి టెస్టులు నిర్వహించారు. ఇందులో జూబ్లీహిల్స్ కు చెందిన సిద్ధార్థ్​(23) అనే యువకుడికి గంజాయి పాజిటివ్ వచ్చింది. 

సిద్ధార్థ్​ జనవరి 31వ తేదీన థాయిలాండ్ వెళ్లినట్లు, అక్కడ బిస్కెట్లు తిన్నానని, అందులో డ్రగ్స్ ఉన్నట్లు తనకు తెలియదని పోలీసుల ఎదుట అంగీకరించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ సెంటర్​కు తరలించారు.