హైదరాబాద్ ఆలివ్ బ్రిస్ట్రో బార్ పై దాడులు : డ్రగ్స్ పార్టీతో దొరికిన కస్టమర్

హైదరాబాద్ ఆలివ్ బ్రిస్ట్రో బార్ పై దాడులు : డ్రగ్స్ పార్టీతో దొరికిన కస్టమర్

హైదరాబాద్ సిటీలో మరోసారి డ్రగ్స్ కలకలం. సిటీ నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్ లోని ఆలివ్ బ్రిస్ట్రో బార్ అండ్ పబ్ పై SOT పోలీసులు.. స్పెషల్ ఆపరేషన్ టీం రైడ్ చేసింది. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంలో.. 2025, ఫిబ్రవరి 16వ తేదీ నైట్ భారీ బందోబస్తు మధ్య స్పెషల్ ఆపరేషన్ టీం తనిఖీలు చేసింది. 

తనిఖీల సమయంలో పబ్ లో ఉన్న 20 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు. అందులో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఆలివ్ బ్రిస్ట్రో బార్ అండ్ పబ్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఒక వ్యక్తి దొరికిపోవటంతో కలకలం రేపుతుంది. 

పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి.. ఎవరు తీసుకొచ్చారు.. అతని వివరాలు ఏంటీ.. ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ దందా నడుస్తుంది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై లోతుగా విచారణ చేస్తూ.. డ్రగ్స్ పెడ్లర్ల వివరాలు సేకరిస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి.. ఆ డ్రగ్స్ ఎవరు ఇచ్చారు.. ఎంతకు కొనుగోలు చేశాడు.. ఎప్పటి నుంచి అతనికి ఈ డ్రగ్స్ అలవాటు ఉంది అనేది కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు.

సిటీలోని బార్లు, పబ్స్ లో డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉండాలంటూ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది కూడా..