చందానగర్​ లో మాదక ద్రవ్యాలు రవాణా.. ఇద్దరు అరెస్ట్​

చందానగర్​ లో మాదక ద్రవ్యాలు రవాణా.. ఇద్దరు అరెస్ట్​

హైదరాబాద్​ లో  మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేసే  ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా డ్రగ్స్​ రవాణా చేస్తున్న ఇద్దరిని చందానగర్ మంజీర రోడ్డు లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 3.1 కేజీల గంజాయి 7.5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.బీహార్  మరియు పశ్చిమ బెంగాల్ నుండి డ్రగ్స్ ను తీసుకువచ్చి నగరం లో విక్రయిస్తున్నట్టు తెలిపిన పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న ఎక్ససైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....