ఆటోలో గంజాయి సరఫరా

ఆటోలో గంజాయి సరఫరా
  •  ఇద్దరు అరెస్ట్, 6 కిలోల సరుకు సీజ్
  •  ఐటీ కారిడార్​లో మరొకరు అరెస్ట్

ముషీరాబాద్, వెలుగు: ఒడిశా నుంచి తీసుకువచ్చిన 6 కిలోల గంజాయిని ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఝార్ఖండ్​కు చెందిన గుడ్డు కుమార్, చేతు కుమార్ యాదవ్ సిటీకి వచ్చి ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి అమ్మకాలకు దిగారు. ఒడిశా నుంచి ఆటోలో గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో బుధవారం దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియం మూడో గేటు వద్ద పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. 6 కిలోల గంజాయితోపాటు ఆటో, సెల్ ఫోన్లు సీజ్​చేసినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.  


గచ్చిబౌలి: ఐటీ కారిడార్​లో గంజాయి అమ్ముతున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన చిత్తరాంజన్ అలియాస్ మున్నా తన ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్, నానక్ రామ్ గూడ ఏరియాల్లో ఐటీ ఉద్యోగులు, కార్మికులకు అమ్ముతున్నాడు. పక్కా సమాచారంతో నిందితుడిని మంగళవారం అర్ధరాత్రి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.1.17 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.