- భోపాల్ ఫ్యాక్టరీలో సీజ్ చేసిన అధికారులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
భోపాల్: డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు రైడ్ చేశారు. దాదాపుగా రూ.1,800 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్ సమీపంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఎన్సీబీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గుజరాత్ ఏటీఎస్‌తో కలిసి ఎన్సీబీ అధికారలు సంయుక్తంగా ఆ ఫ్యాక్టరీపై రైడ్ చేశారు.
అక్కడ తయారు చేస్తున్న మెఫెడ్రోన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో అధికారులను గుజరాత్ మంత్రి హర్ష్ సింఘ్వీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. “డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ అధికారులకు నా అభినందనలు. అధికారులు భోపాల్ ఫ్యాక్టరీపై రైడ్ చేసి రూ.1,814 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
దక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో చట్ట బద్ధ సంస్థల అవిశ్రాంత ప్రయత్నాలకు ఈ విజయం నిదర్శనం” అని తెలిపారు.
అమృత్‌సర్‌లో 10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేశాడన్నారు. అతడి వద్ద నుంచి టయోటా ఫార్చ్యూనర్ కారును స్వాధీనం చేసుకున్నారు.