హైదరాబాద్​సిటీలో రూ.కోటిన్నర డ్రగ్స్​ స్వాధీనం.. నలుగురు పెడ్లర్ల అరెస్ట్​

 హైదరాబాద్​సిటీలో రూ.కోటిన్నర డ్రగ్స్​ స్వాధీనం.. నలుగురు పెడ్లర్ల అరెస్ట్​

 హైదరాబాద్​సిటీ, వెలుగు: దాదాపు రూ.కోటిన్నర విలువైన డ్రగ్స్​ను నల్లకుంట, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్​ఫోర్స్ మెంట్​పోలీసులు కలిసి పట్టుకున్నారు. స్నాప్​చాట్, ఇతర యాప్స్​ద్వారా అమ్మకాలు చేస్తూ.. ఒక్కరోజులోనే రూ.10 లక్షల వరకూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న నలుగురు పెడ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను మంగళవారం సీసీఎస్​లో అడిషనల్​సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు. 

మధ్యప్రదేశ్​జబల్‌‌‌‌పూర్ కు చెందిన హర్షవర్దన్​ఆర్కిటెక్చర్ చదివాడు. జల్సాలకు అలవాటు పడి డ్రగ్స్ దందాలోకి దిగాడు. రిఫైన్డ్​గంజాయిని సేకరించి, సిగ్నల్, టెలిగ్రామ్, రెడిట్​యాప్స్​ద్వారా సరఫరా చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీ, హవాలా ద్వారా చెల్లింపులు చేసేవాడు. చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగి శ్రీనివాస రాహుల్ గంజాయి తాగుతూ..  సరఫరాదారుడిగా మారాడు. 

స్నాప్‌‌‌‌చాట్​లో గంజాయి ఆర్డర్లు తీసుకొని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌లోని పెడ్లర్లకు సరఫరా చేసేవాడు. వీరిద్దరి నుంచి సికింద్రాబాద్​కు చెందిన మరో సాఫ్ట్​వేర్​ఉద్యోగి అభిషేక్, ఆర్కిటెక్ట్​ దావల్​  డ్రగ్స్ కొని, విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో ఈ ముఠాను అరెస్ట్​ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ వివరించారు. నిందితుల నుంచి 1380 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి (ఓజీ), 44 ఎల్‌‌‌‌ఎస్‌‌‌‌డీ బ్లాట్స్, 250 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్స్, రూ.10,640 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, రెండు టూ-వీలర్లు, ఇతర ప్యాకింగ్ మెటీరియల్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు.