![హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్ లో రూ.5 కోట్ల డ్రగ్స్ కాల్చివేత](https://static.v6velugu.com/uploads/2025/02/drugs-worth-rs-5-crores-destroyed-in-hyderabad-excise-division_9huKZdqlEY.jpg)
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్ లో రూ.5 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ ను సోమవారం అధికారులు కాల్చివేశారు. డివిజన్ పరిధిలోని తొమ్మిది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో150 కేసుల్లో ఈ డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీబీ. కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు షాద్ నగర్ లోని ప్రభుత్వ ఆమోదిత డిస్పోజల్ సంస్థ జీజే మల్టీకౌవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డ్రగ్స్ , గంజాయిని దగ్ధం చేశారు.
కాల్చిన వాటిలో 662 కేజీల గంజాయి, 21 కేజీల ఆల్పోజోలం, 5.5 కేజీల హషీష్ అయిల్,366 గ్రాముల కోకైన్, 26 గ్రాముల ఎండీఎం,180 గ్రాముల ఓపీయం డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ కాల్చివేత కార్యక్రమంలో ఏఈఎస్ శ్రీనివాసరావు, కాచిగూడ, అమీర్ పేట్ ఎస్ హెచ్ ఓలు శ్రీధర్, బానోత్ పటేల్ తో పాటు ఎస్సైలు శ్రవణ్, నవనీత, శ్వేత, పాషా, సుజాత, చంద్రకాంత్ రెడ్డి, ధన్ రాజ్ గౌడ్ పాల్గొన్నారు.