మంత్రి తుమ్మలతో ద్రుమతారు కన్సల్టెన్సీ భేటీ

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మెడికల్ కాలేజీ నిర్మాణ సంస్థ అయిన ద్రుమతారు కన్సల్టెన్సీ ప్రతినిధులు గురువారం మంత్రి  తుమ్మల నాగేశ్వర రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లాలో చేపట్టే మెడికల్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణాల గురించి మంత్రి తుమ్మలకు వివరించారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే మెడికల్ కాలేజీలో మొదటి విద్యా సంవత్సరం ప్రారంభించినందున, ఇప్పుడు చేపట్టబోయే కొత్త నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని కోరారు.

స్టేట్​లోనే ఖమ్మం మెడికల్​ కాలేజీ బెస్ట్​ గా ఉండాలని సూచించారు.  కొత్త భవన నిర్మాణానికి 5 ఎకరాలు స్థలం అందుబాటులో ఉన్నదని, మెడికల్  కాలేజీ బిల్డింగ్, వసతి గృహం, ప్రిన్సిపాల్ క్వార్టర్స్ నిర్మాణాలు ప్రస్తుతం చేపడుతున్నామని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు.