
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్అండ్డ్రైవ్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ తప్పతాగి దొరికాడు. ఓవర్‌స్పీడ్‌తో వస్తున్న అంబులెన్స్ ను ఆపగా, డ్రైవర్ ఫుల్లుగా తాగినట్టు కనిపించాడు. దీంతో అతడికి బ్రీత్ అనలైజర్ తో పరీక్ష నిర్వహించగా, రీడింగ్ 234 వచ్చింది.
వెంటనే అదుపులోకి తీసుకుని అంబులెన్స్ ను సీజ్ చేశారు. డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.