బషీర్ బాగ్, వెలుగు: ఈ నెల 1 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్తనిఖీల్లో 4,056 మందిపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ పి.విశ్వప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో దొరికిన వారి నుంచి ఫైన్ల రూపంలో రూ.76,43,700 వసూలు చేసినట్లు వెల్లడించారు.
300 మందికి ఒక రోజు నుంచి10 రోజుల వరకు జైలు శిక్ష పడిందని, 32 మందిని రెండు రోజుల పాటు సోషల్ సర్వీస్ చేయాలని న్యాయస్థానం ఆదేశించిందని చెప్పారు. 19 మంది లైసెన్స్‌లను 2 నుంచి 6 నెలల వరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 12వ తేదీ ఒక్కరోజే 65 మందికి జైలు శిక్ష పడిందన్నారు