జాంబీ సినిమాలో మనుషుల్ని మనుషులు కొరికి జాంబీలుగా మారుస్తుంటారు కదా. అలాంటి సంఘటనే చెన్నై రోడ్లపై కాసేపు హైడ్రామా క్రియేట్ చేసింది. ఇద్దరు విదేశీయులు మద్యం మత్తులో చెన్నైలోని రాయపేట జంక్షన్ రోడ్డుపై వీరంగం సృష్టించారు. టూవీలర్ పై ప్రయాణించే వారిపై దాడి చేస్తూ ఫారన్నర్స్ హల్ చల్ చేశారు. ఫుల్ గా తాగి ఇద్దరు విదేశీయులు ఒంటిమీద బట్టలు లేకుండా కేవలం షార్ట్ ధరించి నానా హంగామా క్రియేట్ చేశారు.
ALSO READ | చదువుకున్నోళ్లే కదా : కారు కోసం పెళ్లాన్ని చంపటం ఏంటీ.. మైండ్ ఉందా..
సిగ్నల్స్ దగ్గర ఆగి ఉన్న వారిని వెనుకనుంచి వెళ్లి కొరుకుతున్నారు. స్థానికులు భయాందోళనలకు గరై... ఆశ్చర్యంగా చూస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విదేశీలను అదుపులోకి తీసుకున్నారు. వారు ఎవరో అనే వివరాలు ఇంకా గుర్తించలేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జోంబీ బిహేవియర్ అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు వారు స్పైసీ ఇండియన్ ఫుడ్ని హ్యాండిల్ చేయలేరని సెటరికల్ గా రాసుకొచ్చారు.