
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరకాల విన్యాసాలను చేస్తుంటారు యువత.. ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి.. ముఖ్యంగా రోడ్లపై యువత చేసే బైక్ విన్యాసాలు.. వీటిపై పోలీసులు ఎంతగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుంటాయి.. తాజాగా మరొక ఘటన వెలుగు చూసింది.. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే....
మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఓ మహిళ .. ఇద్దరు మగాళ్ల ఉండి.. స్టంట్స్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి బైక్ మీద వెళ్తున్నారు. ముగ్గురు కూడా తప్పతాగి ఉన్నవిధంగా ఉంది. ఇక ఇద్దరి యువకుల మధ్యలో ఉన్న యువతి రన్నింగ్బైక్ పై నిల్చుంది. ఇక అంతే అటూ ఇటూ పోయే వారికి.. కారులో వెళ్తున్న వారికి ప్లయింగ్ కిస్ లు ఇస్తూ నానా రచ్చ చేసింది. అయితే ఈ వీడియోను కారులో వెళ్తున్న వారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.
चलती बाइक पर पापा की 'बेवड़ी' परी फ्लाइंग Kiss बांट रही है. pic.twitter.com/GfUGNaIUiF
— बलिया वाले 2.0 (@balliawalebaba) March 1, 2025
భోపాల్‌లో జరిగిన బైక్ పై యువతి ప్లయింగ్ కిస్ స్టంట్ వీడియో క్లిప్ X ట్విట్టర్ లో @balliawalebaba అనే యూజర్ షేర్ చేశారు. ఒకరు వ్యంగ్యంగా స్పందిస్తూ.. తాగిన మైకంలో దేవదూతలా ప్రవర్తిస్తున్నారు.. ఇది చాలా ప్రమాదకరమని రాశారు. మరొకరు వాళ్లకు వాళ్లే హాని చేసుకుంటూ.. పక్కనున్న వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారని రాశారు. ఇంకొకరు.. నేటి యువత పరిస్థితి విచారకరంగా ఉందంటూ.. యువత ఎక్కడికి వెళుతోందని ప్రశ్నించారు.
ఈ ఘటనపై కోహెఫిజా పోలీస్ స్టేషన్‌లో వైరల్ వీడియో ప్రకారం.. మగాళ్ల మధ్యన మహిళ అనుచితంగా బైక్ పై ప్రవర్తించడం వలన ప్రజా భద్రతకు ప్రమాదం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. కోహెఫిజా మరియు భోపాల్ ట్రాఫిక్ పోలీసులు బైక్ పై ఉన్న ఇద్దరు మగాళ్లను ( బైక్ రైడర్ హృతిక్ యాదవ్, పిలియన్ రైడర్ సుమిత్ కుమార్‌లను) అరెస్టు చేశారు. ప్రస్తుతం స్టంట్స్ చేసిన మహిళ పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. బైక్ ను సీజ్ చేసిన పోలీసులు హృతిక్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారుకు సిఫారస్ చేశారు.
రోడ్ల మీద ఇష్టమున్నట్లు అమ్మాయిల్ని ఎక్కించుకుని రొమాన్స్ చేస్తున్నారు. తప్పతాగి ఇష్టమున్నట్లు బైక్ లు నడిపిస్తు ఇతరులను కూడా డేంజర్ లో నెట్టేస్తున్నారు. కొంత మంది యువత ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. ముఖ్యంగా వీకెండ్ , రాత్రిళ్లు కాగానే.. బైక్ ల మీద ఇష్టమున్నట్లు తిరుగుతున్నారు. తప్పతాగి.. తమ లవర్ లతో స్పీడ్ గా డ్రైవింగ్ లు చేస్తు హల్ చల్ చేస్తున్నారు.