తాగిన మత్తులో కొందరు ఏం చేస్తుంటారో వారికే తెలియదు..మత్తుతో వచ్చిన కిక్కుతో నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి ఇలాంటి వారు చేసే పనులు కొన్ని ప్రమాదాలను తెచ్చిపెడుతుంటాయి. కొందరు తమ బాధలు మర్చిపోవడానికి తాగుతున్నాం అంటారు.. ఇంకొంతమంది ఎంజాయ్ చేయడానికి తాగుతుంటాం అని చెబుతుంటారు.. కానీ వారు చేసే పనుల్లో కొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి. నవ్వుకునేలా చేస్తాయి. ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తి మద్యం మత్తులో అర్థరాత్రి పోలీసులకు ఫోన్ చేసి ‘‘నా ఆలుగడ్డలు దొంగిలించారంటూ.. వెతికిపెట్టండి’ అని హల్ చల్ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చేసిన నెటిజన్లు పొట్ట పగిలేలా నవ్వుకుంటున్నారు.
मेरे आलू गायब हो गए.. दो ढाई सौ ग्राम थे.. 4 बजे छोलके रखके गए थे.. सोचा था खा-पीके आऊंगा, बनाऊंगा.. किसी ने चोरी कर लिए.. यही जांच करनी है.. बेचारे भोले-भाले मजदूर के साथ ट्रेजडी हो गई. अब बताइए, कहां से लाए आधी रात को आलू!! पुलिस की नौकरी क्या न कराए.. ढूंढिए पुलिस जी आलू.. pic.twitter.com/9GKsufW82V
— Vivek K. Tripathi (@meevkt) November 1, 2024
ఉత్తరప్రదేశ్ లోని హర్డోయ్ పరిధిలోని మన్నాపూర్వాలో ఈ విచిత్ర ఘటన జరిగింది. మద్యం మత్తులో విజయ్ వర్మ అనే వ్యక్తి తన పావుకిల(250 గ్రాములు ) ఆలుగడ్డలు దొంగిలించారని పోలీసులకు ఫోన్ చేశాడు. ఉడకబెట్టి, ఒలిచి ఇంట్లో ఉంచిన ఆలుగడ్డలను ఎవరో దొంగిలించారని 112 కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. విజయ్ వర్మ తన ఆలుగడ్డల అదృశ్యం వెనక మిసర్టీని ఛేదించాలని పోలీసులను కోరాడు. విషయం ఏందో కనుక్కుందామని తాగుబోతు ఇంటికి వచ్చిన పోలీసులు.. అతని మాటలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. నెటిజన్లు ఈ వీడియో షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read :- స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
నా ఆలుగడ్డలు తప్పిపోయాయి.. దాదాపు 250 గ్రాములు.. నేను వాటిని ఒలిచి 4 గంటలకు ఉంచాను.. తిని తాగి మళ్లీ వండాలని అనుకున్నాను.. ఎవరో దొంగిలించారు..మీరు ఎంక్వైరీ చేయడం చాలా ముఖ్యం.. దర్యాప్తు చేయాలి ’’ అని విజయ్ వర్మ కంప్లయింట్ చేసిన తీరును చూసి పోలీసులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఆతర్వాత పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా పొట్ట పగిలేలా నవ్వుకుంటున్నారు.
ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. విజయ్ వర్మ ఫిర్యాదుపై సీఐడీ లేదా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.