మద్యం మత్తులో ఉన్న వారు తాము ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతారు. పూర్తిగా మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. మరి కొందరైతే డ్రింకింగ్ సెషన్ ముగిశాక రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి తాగి ఎద్దుపై స్వారీ చేస్తున్న వీడియోలను, మరొక వ్యక్తి మత్తులో ఉండి బిల్‌బోర్డ్ ఫ్రేమ్‌కు వేలాడుతున్న వీడియోలను చూసి ఉంటారు. ఆ వీడియోలకు జోడిస్తూ, సైన్‌బోర్డ్ పైన ఒక వ్యక్తి పుష్-అప్‌లు చేస్తున్న ఈ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అవుతోన్న ఈ వీడియో.. ఒడిశాలోని సంబల్‌పూర్‌లో జరిగింది. ఈ వీడియోలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎత్తైన సైన్‌బోర్డ్‌పై పుష్-అప్‌లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో కొనసాగుతుండగా, వాహనాలు సైన్‌బోర్డ్ కింద ప్రయాణిస్తున్నట్లు, జనం అంతా ఆ వ్యక్తిని చూస్తున్నట్టు చూడవచ్చు.
ఈ వీడియోకు ఇప్పటివరకు 7లక్షల34వేల వ్యూస్ రాగా, అనేక కామెంట్లు వచ్చాయి. ఈ వ్యక్తిపై ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుండగా.. ఆ వ్యక్తి తర్వాత ఏమయ్యాడని పలువురు ఆరా తీశారు.