నడిరోడ్డుపై తాగుబోతు వీరంగం... ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం

పెద్దపల్లి జిల్లాలో ఓ తాగుబోతు రెచ్చిపోయాడు. మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద పట్టపగలే నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశాడు. అతనికి అడుకున్న వారితో వాగ్వాదానికి దిగాడు. రోడ్డుపై ఎవరిని పడితే వారిని కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 

మంథని మెయిన్ రోడ్డుపై గొడవ జరగడంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తాగుబోతును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.