![Viral news: కండెక్టర్పై కోపంతో.. ఏకంగా బస్సునే హైజాక్ చేసిన తాగుబోతు](https://static.v6velugu.com/uploads/2025/02/drunk-man-hijacks-chennai-mtc-bus-to-take-revenge-from-conductor-this-happens-next_p80vmefD6K.jpg)
కండక్టర్ పై రివెంజ్ తీర్చుకోవడం కోసం ఏకంగా బస్సును దొంగిలించాడు..ఆ బస్సుతో నానా రచ్చ చేశాడు. కండక్టర్ మీద కోపంతో బస్సును దొంగిలించి తీసుకుపోతూ యాక్సిడెంట్లూ చేశాడు. విషయం తెలుసుకన్న ఆర్టీసీ సిబ్బంది వెంబడించి చివరికి అతని పట్టుకోవడం పెద్ద ప్రమాదం తప్పింది. తమిళ నాడులోని చెన్నైలో MTC ఆర్టీసీ బస్సును హైజాక్ చేసి లారీ ఢీకొట్టిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెసెంట్ నగర్ నివాసి అబ్రహం స్థానికంగా ఉన్న గుడువాంచెరిలో కార్ ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఓరోజు బస్సులో వెళ్తుండగా కండక్టర్ తో గొడవ జరిగింది.. దీంతో కండక్టర్ అతన్ని కిందికి దించేశాడు..దీంతో కండక్టర్ పై కోపం పెంచుకున్న అబ్రహం రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు..
గురువారం (ఫిబ్రవరి 13) తెల్లవారు జామున తిరువాన్మియూర్ బస్ టెర్మినల్ నుంచి బస్సును అబ్రహం అపహరించారు. తాగిన మైకంలో ఉన్న అబ్రహాం బస్సును అడ్డగోలుగా నడిపుతూ లారీతోపాటు రెండు వాహనాలను ఢీకొట్టాడు. దీంతో స్థానికులు, వాహనాదారులను భయాందోళనకు గురిచేశాడు. హైజాక్ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అబ్రహం మద్యం మత్తులో ఉన్నాడని, లారీని ఢీకొన్న విషయం లారీ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసు బృందం బస్సును కొద్ది దూరం వెంబడించి చివరకు అతికష్టం మీద అతన్ని పట్టుకోగలిగారు.
పోలీసులు తమదైన శైలిలో అబ్రహాంను విచారించడంతో అసలు చెప్పేశాడు. కండక్టర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకే బస్సును హైజాక్ చేశానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అబ్రహాం ను అరెస్ట్ చేశారు.