లేడీస్ జోలికెళ్తే దబిడి దిబిడే.. ఆర్టీసీ బస్సులో తాగుబోతును పొట్టు పొట్టు కొట్టిన యువతులు

లేడీస్ జోలికెళ్తే దబిడి దిబిడే.. ఆర్టీసీ బస్సులో తాగుబోతును  పొట్టు పొట్టు కొట్టిన యువతులు

ఆర్టీసీ బస్సులో తాగుబోతు వీరంగం సృష్టించడం కలకలం రేపింది. తాగి బస్సు ఎక్కడమే కాకుండా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతులతో గొడవకు దిగాడు. ఎదురు తిరగటంతో అమ్మాయిలు అని కూడా చూడకుండా తన్నటం మొదలుపెట్టాడు. చివరికి యువతులు దేహశుద్ధి చేసి పంపారు.
  
ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు యువతులపై అసభ్యంగా ప్రవర్తించి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాడు. వేములవాడ నుండి సిద్దిపేటకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సు, సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఆగినప్పుడు మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు బస్సులో ఎక్కాడు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి మీదుగా బస్సు నడుస్తున్న సమయంలో, యువతులతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

►ALSO READ | హైదరాబాద్లో చీరల దొంగలు.. కృష్ణా జిల్లా నుంచి 60 మంది ముఠా.. వీళ్ల నెట్వర్క్ చూసి పోలీసులే షాక్

యువతులు  ఆ తాగుబోతును గమనించి ప్రశ్నించడంతో, సదరు తాగుబోతు వారిపై దాడికి దిగాడు. దీంతో అతడిని అక్కడికక్కడే బస్ లోనే యువతులు దేహశుద్ధి చేశారు. వెంటనే  స్పందించిన బస్ డ్రైవర్, సదరు వ్యక్తిని బస్సు నుండి బలవంతంగా నేరేళ్ళ  గ్రామంలో దింపివేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒక ప్రయాణికుడు చిత్రీకరించడంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.