విమానంలో లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్

అమృత్‌సర్‌ విమానంలో ఎయిర్‌ హోస్టెస్‌ను వేధించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ లోని జలంధర్ కోట్టి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్ అనే ప్రయాణికుడు మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. అతన్ని మందలించిన సిబ్బందిపై రాజిందర్ సింగ్ వాగ్వాదానికి దిగాడు. దాంతో సిబ్బంది ఎయిర్ లైన్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్కు తెలియజేశారు బాధితులు.

ఈ విషయాన్ని ఎయిర్ లైన్ సిబ్బంది అమృత్ సర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. శ్రీ గురు రాందాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని... నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే.. ప్రాథమిక విచారణలో నిందితుడు మద్యం మత్తులో వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది.నిందితుడిపై సెక్షన్ 354, సెక్షన్ 509 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటివరకు విమానంలో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో జరిగాయి. ఈ ఘటనపై స్పందించిన నెటిజన్స్.. ప్రయాణికుడిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.