మద్యం మత్తులో ప్రముఖ డైరెక్టర్ బీభత్సం.. ఒకరు మృతి.. 8 మందికి గాయాలు

మద్యం మత్తులో ప్రముఖ డైరెక్టర్ బీభత్సం.. ఒకరు మృతి.. 8 మందికి గాయాలు

కోల్‎కతా: బెంగాలీ ప్రముఖ దర్శకుడు సిద్ధాంత దాస్ అలియాస్ విక్టో మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. పీకల్లోతూ మద్యం సేవించి కార్‎ రాష్ డ్రైవింగ్ చేసి జనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డైరెక్టర్ సిద్ధాంత దాస్‎ను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. దక్షిణ కోల్‌కతాలోని ఠాకూర్‌పుకూర్ ప్రాంతంలో ఆదివారం (ఏప్రిల్ 6) ఉదయం మార్కెట్‌లోని జనసముహాంపైకి ఓ కార్ వేగంగా దూసుకెళ్లింది. 

కారు బీభత్సానికి ఓ వ్యక్తి మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తిని డైరెక్టర్ సిద్ధాంత దాస్‎గా గుర్తించామని వెల్లడించారు. ఆయనతో పాటు కారులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రియ బసు కూడా ఉన్నారని తెలిపారు. ఇద్దరు మద్యం సేవించి ఉన్నారని చెప్పారు. వీరిద్దరూ ఆదివారం ఓ పబ్‎కి వెళ్లి రాత్రంతా మద్య సేవించినట్లు గుర్తించామన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైన డైరెక్టర్ సిద్ధాంత దాస్‎‎పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

►ALSO READ | అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణం తీశాడు..వడ్డీ వ్యాపారిని చంపి సంపులో పడేశాడు..

ఈ ఘటనపై కోల్‌కతా పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైమండ్ హార్బర్ రోడ్డులోని ఠాకూర్‌పుకూర్ బజార్ సమీపంలో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కారు అనేక మంది పాదచారులను ఢీకొట్టిందని తెలిపారు. దీంతో ఆరుగురు తీవ్రంగా గాయపడగా.. ఒకరు మృతి చెందరాన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నామని.. కేసు దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.