మందుబాబులకు అడ్డాలుగా సర్కార్ బడులు

వేసవి సెలవుల్లో  సర్కార్ బడులు  మందుబాబులకు  అడ్డాలుగా మారాయి.  వరంగల్ జిల్లా  పర్వతగిరి మండలం  రోళ్ళకళ్లు   గ్రామంలోని  ప్రభుత్వ పాఠశాలలో  మద్యం బాటిల్స్  దర్శనమిస్తున్నాయి. రేపటి నుంచి  స్కూల్స్  రీ ఓపెన్  కానున్నాయి. సరైన  పర్యవేక్షణ  లేకపోవడంతో  గవర్నమెంట్ స్కూల్స్ అసాంఘిక  కార్యక్రమాలకు  నిలయం అయ్యాయంటూ  పేరెంట్స్  ఫైరవుతున్నారు. ఇలా ఉంటే పాఠశాలలకు  పిల్లలను ఎలా  పంపించాలని  ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.