మద్యం మత్తులో బీఆర్ఎస్ నేత బీభత్సం.. 8 మందికి గాయాలు

నల్గొండలో మద్యం మత్తులో బీఆర్ఎస్ నేత బీభత్సం సృష్టించాడు. తిప్పర్తి మండలం రామలింగాల గూడెంకు చెందిన బీఆర్ఎస్ నేత ముత్తినేని నాగేశ్వర్ రావు తాగి డ్రైవ్ చేశారు. దీంతో నాగేశ్వర్ కారు పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిందన్నారు. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను హాస్పిటల్ కు తరలించారు. ముత్తినేని నాగేశ్వర్ రావు నడిపిన కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. నాగేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.