మద్యం మత్తులో ఓ యువకుడి హల్ చల్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ లో చోటుచేసుకుంది. ఫుల్ గా ముందు తాగి బెల్టుషాపు యజమానిపై కూల్ డ్రింక్ సీసాతో దాడి చేశాడు. అక్కడున్న స్థానికులు యువకుడిని పట్టుకొని చేతులు కట్టేసి కర్రలతో చితకబాదారు.
కర్రలతో కొట్టడంతో ఆ యువకుడి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో పరిస్థితి విషమించింది. వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. యువకుడిపై దాడిచేసిన వారిపై బోనకల్ పోలీస్ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. స్థానికులు కొందరు ఈ ఘటనను ఫోన్ లో వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేయగా వైరల్ గా మారింది.