మద్యం మత్తులో పోలీసుల వీరంగం.. ఇంకో బాటిల్ కావాలని బూతులు తిడుతూ దాడి

సూర్యాపేట: నేరేడుచర్లలో మద్యం మత్తులో ఇద్దరు కానిస్టేబుళ్లు హంగామా సృష్టించారు.  నేరేడుచర్ల మున్సిపాలిటి పరిధిలోని నరసయ్య గూడెంలో ఓ బెల్టుషాపులో మద్యం సేవించారు. మద్యం సరిపోలేదని ఇంకా తీసుకురావాలని బెల్టు షాపు నిర్వాహకులను బెదిరించారు. మద్యం లేదని చెప్పడంతో బూతులు తిడుతూ వారిపై దాడి చేశారు. విధులు నిర్వహించాల్సిన పోలీసులు తరుచుగా బెల్ట్ షాపు లో  మద్యం సేవిస్తూ నిర్వహకులను బెదిరిస్తున్నారు. దీంతో బెల్ట్ షాపు నిర్వాహకుడు, కానిస్టేబుళ్లకు మధ్య ఘర్షణ తలెత్తి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.  వీరు ఘర్షణ పడుతుండగా.. వీడియో తీస్తుండగా  వారిపై కూడా దాడి చేశారు.  నరసయ్యగూడెంలో వీరి ఆగడాలు పెరిగిపోయాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.