- టీచర్ను గదిలో బంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు
- భద్రాద్రి కొత్తగూడెం జీపీపల్లిలో ఘటన
చర్ల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లిలో మద్యం మత్తులో ఓ టీచర్స్టూడెంట్స్ను చితకబాదాడు. దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ను గదిలో నిర్బంధించారు. స్థానికుల కథనం ప్రకారం..జీపీపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ భానోత్ కృష్ణ బుధవారం మద్యం తాగి స్కూల్కు వచ్చాడు. కొందరు విద్యార్థులను అకారణంగా చితకబాదాడు.
విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి టీచర్ను గదిలో బంధించి ఎంఈవోకు సమాచారమిచ్చారు. ఆయన విచారణకు ఓ అధికారిని పంపించడంతో అతడికి పొంతనలేని సమాధానాలిచ్చాడు. స్టూడెంట్స్ మాట్లాడుతూ ఇన్చార్జి హెడ్మాస్టర్ రోజూ తాగి వచ్చి కొడుతున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.