పంజాగుట్ట సైడ్ వెళ్లేటోళ్లు జాగ్రత్త.. ఈ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ లాంటోడు చాలు.. అట్నుంచి అటే తీసుకెళ్లిపోతారు..!

పంజాగుట్ట సైడ్ వెళ్లేటోళ్లు జాగ్రత్త.. ఈ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ లాంటోడు చాలు.. అట్నుంచి అటే తీసుకెళ్లిపోతారు..!

హైదరాబాద్: పీకల దాకా మందు కొట్టిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ఘటన హైదరాబాద్లో జరిగింది. ఉప్పల్ నుంచి పంజాగుట్ట మీదుగా అమీర్ పేట వైపు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు ఆపారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు డ్రైవర్కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. 325 బీఏసీ పాయింట్స్ రావడంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. ట్యాంకర్ డ్రైవర్ యాదగిరి మీద

కేసు నమోదు చేసిన పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ట్యాంకర్ను సీజ్ చేశారు. ఈ తరహా ఘటనలు ఇటీవల హైదరాబాద్లో పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.

హైదరాబాద్లో ఇటీవలే పీకల దాకా తాగి ఓవర్ స్పీడ్గా కారు నడిపిన యువతులు ముందు వెళుతున్న బైకులను ఢీ కొట్టారు. మార్చి 6న ఈ ఘటన జరిగింది. పీకల దాకా మద్యం తాగి కారును ఓవర్​స్పీడ్గా నడిపిన యువతులు.. ముందు వెళ్తున్న బైకులను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైకులు ధ్వంసం కాగా... ప్రశ్నించినందుకు బాధితులపైనే దౌర్జన్యం చేశారు.

ALSO READ | గంజాయిని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దాకా తీసుకొచ్చారు.. కారులో 115 కేజీలు దొరికింది..!

విషయం తెలిసి అక్కడికి వచ్చిన ట్రాఫిక్​ పోలీసులతోనూ గొడవపడ్డారు. చివరికి వారికి బ్రీత్​ఎనలైజర్​తో టెస్టు చేయగా 212 బీఏసీ రికార్డయ్యింది. దీంతో డ్రంక్​అండ్​డ్రైవ్​కేసు నమోదు చేశారు. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్​పిల్లర్​నంబర్ 740 వద్ద మార్చి 6న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

సాఫ్ట్వేర్​ఇంజినీర్​అయిన ఓ యువతి (28) మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కూకట్​పల్లి నుంచి కారుని డ్రైవ్​ చేసుకుంటూ వెళ్తోంది. కేపీహెచ్బీ మెట్రోస్టేషన్​వద్దకు రాగానే అదుపు తప్పి ముందు వెళ్తున్న రెండు బైక్లను ఢీకొట్టారు. వాహనదారులకు ఎలాంటి గాయాలు కాకపోయినా టూ వీలర్లు ధ్వంసమయ్యాయి. బాధితులు యువతులను ప్రశ్నించగా గొడవకు దిగారు.

భారీగా ట్రాఫిక్​జామ్​అవుతుండడంతో ట్రాఫిక్​పోలీసులు అక్కడికి వచ్చారు. కారులో చూడగా బీర్​టిన్స్​కనిపించాయి. అప్పటికే మత్తులో ఉన్న వీరు కారులో కూడా డ్రింక్​చేస్తూ వచ్చారని పోలీసులు గుర్తించారు. బ్రీత్​ఎనలైజర్​టెస్ట్ చేయగా పాజిటివ్​వచ్చింది. కేసు నమోదు చేశారు. కారు నాగవెంకట హైందవి తొర్లికొండ పేరుతో రిజిస్టర్​అయి ఉంది. పోలీసులు ఈ వివరాల ఆధారంగా విచారణ జరిపారు.