మద్యం మత్తులో యువతి హల్ చల్

మద్యం మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది. అడ్డు వచ్చిన వారిపై బూతులు తిడుతూ... రాళ్ళతో దాడికి దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మార్చి 25వ తేదీ శనివారం రాత్రి జరిగింది. కరీంనగర్ కు చెందిన ఓ యువతి కరీంనగర్ లో ఆటో కిరాయి తీసుకొని గోదావరిఖనిలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. చౌరస్తాలో దిగిన ఆమెను ఆటో డ్రైవర్ డబ్బులు అడగడంతో డ్రైవర్ పై బూతు పురాణం మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడికి దిగింది. అడ్డువచ్చిన వారిపై కూడా దాడి చేసింది. 

అక్కడి నుండి మళ్లీ గోదావరిఖని బస్టాండ్ కు వెళ్లింది. అక్కడ కూడా ఆటో డ్రైవర్లను తిడుతూ దాడి చేసింది. స్థానికులు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు యువతి బ్యాగ్ ను చెక్ చేయగా అందులో మద్యం సీసా లభ్యమైంది. వివరాలు తీసుకున్న పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, కరీంనగర్ కు పంపించారు.