నంద్యాల జిల్లా: 300 అడుగుల పాము అంటూ తాగుబోతు ఫేక్​ కాల్​

నంద్యాల జిల్లా: 300 అడుగుల పాము అంటూ తాగుబోతు ఫేక్​ కాల్​

మద్యం మత్తులో ఓ వ్యక్తి అటవీ అధికారులను  ముప్పతిప్పలు పెట్టాడు. నంద్యాల జిల్లా ఆత్మకూర్​ మండలం కరివెనలో అర్దరాత్రి బాగా మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే....నంద్యాల జిల్లా జిల్లా ఆత్మకూర్ మండలం కరివెన గ్రామం లో ఒక తాగుబోతు అర్ధరాత్రి ... 102..  108 నంబర్స్ కి కాల్ చేసి 300 అడుగుల పాము ఉందని ... ఇక్కడ ప్రజలు భయబ్రతులకి గురవుతున్నారని కాల్ చేసి చెప్పాడు . అతను ఏంచేస్తున్నాడో కూడా తెలిపరిస్థితిలో ఉన్నాడనుకుంట.    ఇక అంతే  ఫోన్​ పట్టుకొని చేతికొచ్చిన నంబర్లు డయిల్​ చేశాడో ఏమో తెలియదుకాని .. 102... 108 ఎమర్జన్సీ నంబర్లకు కాల్​ చేసి 300 అడుగుల పెద్ద పాము ఉందని.. దానికి చూసి జనాలు భయపడుతున్నారని చెప్పాడు.

ఇక అంతే అటవీ అధికారులు.. 102 సిబ్బంది.. 108 సిబ్బంది ఆఘమేఘాల మీద  తాగుబోతు చెప్పిన అడ్రస్​ కు చేరుకున్నారు. పాము ఎక్కడ ఉందని అతనిని అడగగా.. అక్కడ.. ఇక్కడ అంటూ చెబుతూ అధికారులకు మభ్య పెట్టాడు.  ఎంత వెతికినా పాము కనపడలేదు.   ఇక అంతే మద్యం మత్తులో ఫేక్​ కాల్ చేస్తావా.. అని ఆ తాగుబోతుని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.