వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

 వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్: డెంగ్యూ వ్యాధి నివారణకు  ప్రజలు ప్రతి  శుక్రవారం, ఆదివారం  డ్రై డే పాటించాలని  మంత్రి గంగుల కమలాకర్ కోరారు. కరీంనగర్ లోని వావిలాల పల్లిలో  డ్రై డేను  ప్రారంభించారు. ఇంటింటికి  తిరుగుతూ నిల్వ  ఉన్న నీటిని  తొలగించారు  గంగుల కమలాకర్. సీజనల్ వ్యాధులు  ప్రబలకుండా  ప్రభుత్వం ముందస్తు  చర్యలు తీసుకుంటుందని  మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.