యాదాద్రి, వెలుగు: రైతులకు వెంటనే టార్పాలిన్లు అందించాలని రాష్ట్ర సివిల్సప్లయ్కమిషనర్ డీఎస్‌చౌహాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి భువనగిరి మండలం నందనం ఐకేపీ సెంటర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు, ట్రాన్స్పోర్ట్ వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పలువురు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తమకు టార్పాలిన్లు అందడం లేదని పలువురు రైతులు రాష్ట్ర చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు. అకాల వర్షాలతో వడ్లు తడుస్తాయన్న భయం కలుగుతోందని వారు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్కలెక్టర్ బెన్షాలోమ్, సివిల్‌సప్లయ్ డీఎం గోపీకృష్ణ, డీసీఎస్వో శ్రీనివాస్‌రెడ్డి, డీఏవో అనురాధ ఉన్నారు.