
డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటుని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డీఎస్ తాను కలిసి యూత్ కాంగ్రెస్ లో పని చేశామని గుర్తు చేశారు. తమ ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన డీఎస్ అంత్యక్రియల్లో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
డీఎస్ కు సీయం కావాలన్న ఆశ ఉండేదని అర్వింద్ కు కేంద్ర మంత్రి పదవి రావాలని ఆశించారు తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో డీఎస్ ది కీలక పాత్ర అని చెప్పారు. మేడం సోనియాను ఒప్పించింది డిఎస్ అని గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షునిగా 2 సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారని తెలిపారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు వివేక్ వెంకటస్వామి.