నిజామాబాద్ లో డీఎస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

నిజామాబాద్ లో డీఎస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

నిజామాబాద్ సిటీ, వెలుగు:  నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ గ్రౌండ్ లో డీఎస్ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ప్రారంభమైంది. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ సభ్యుడు ధర్మపురి సురేందర్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 26 పాఠశాలలకు చెందిన 1200 మంది బాల బాలికలు మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన విజయ్ ఉన్నతి  పాఠశాల ప్రథమ, కేజీబీవీ బాల్కొండ ద్వితీయ స్థానంలో నిలిచాయి.

జెడ్పీహెచ్ ఎస్ కళ్లడి, టీఎంఆర్ఈఎస్ నిజామాబాద్  ప్రత్యేక  బహుమతులు గెలుచుకున్నాయి.  వాలీబాల్ పోటీల్లో జూనియర్ కాలేజీ బాల బాలికల జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరాయి.  పాఠశాల బాలికల విభాగంలో 28 మ్యాచ్ లు, బాలుర విభాగంలో 20 మ్యాచ్ లు జరిగాయి.  బుధవారం వాలీబాల్, ఖోఖో పోటీలు జరుగనున్నాయి.  మార్చ్ ఫాస్ట్ విజేతలకు ధర్మపురి సురేందర్, ధర్మపురి సంజయ్ బహుమతులు అందజేశారు.  కార్యక్రమంలో కమిటీ సభ్యులు  డి.సాయిలు, పేట అధ్యక్షుడు విద్యా సాగర్ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ  నాగమణి తదితరులు పాల్గొన్నారు.