యాదాద్రి నర్సన్న..హైకోర్టు తీర్పును కేసీఆర్ అమలు పర్చాలి

యాదాద్రి : డీఎస్సీ 2008 బీఈడీ మెరిట్ అభ్యర్థులు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పును ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపర్చాలని స్వామివారిని వేడుకున్నారు. 

అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు అమరవీరుల స్తూపం నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల వరకు డీఎస్సీ 2008 బీఈడీ మెరిట్ అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. 

 వెంటనే నియమించాలని మొక్కులు చెల్లించుకున్నారు. 2016లో వరంగల్ నిర్వహించిన సభలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలని కోరుతూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.