డీఎస్సీ 2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్...కాంట్రాక్ట్​ టీచర్లుగా నియామకం

డీఎస్సీ 2008 అభ్యర్థులకు  గుడ్ న్యూస్...కాంట్రాక్ట్​ టీచర్లుగా నియామకం

హైదరాబాద్,వెలుగు: ఎట్టకేలకు డీఎస్సీ 2008 అభ్యర్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ బాధిత అభ్యర్థులను కాంట్రాక్టు ఎస్జీటీ లుగా నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా ఉత్తర్వులు జారీచేసింది. 

రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 1382 మందిని కాంట్రాక్టు టీచర్లుగా తీసుకుంటున్నట్టు ప్రకటించారు. వీరికి వేతనం రూ.31,040 ఉంటుందని వెల్లడించారు. కాగా, జిల్లాల వారిగా లిస్టులను డీఈఓలకు పంపించారు. మరోసారి అక్కడ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసి.. వారికి పోస్టింగ్ లు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.