ఉద్యోగాలు ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శన

హైదరాబాద్‌:  తమకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని  డీఎస్సీ 2008 బాధితులు డిమాండ్​ చేశారు.    ఇవాళ  ప్రజావాణి నేపథ్యంలో రాష్ట్రంంలోని వివిధ ప్రాంతాల నుంచి 300 మందికిపై అభ్యర్థులు ప్రజాభవన్‌కు  భారీగా తరలి వచ్చారు.  తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

ALSO READ :- Nuvvu Nenu: థియేటర్స్లో రీ రిలీజ్ అవుతున్న ఉదయ్ కిరణ్ నువ్వు నేను మూవీ

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో రేవంత్‌ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే 30 వేల మందికి  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందన్నారు. డీఎస్సీ 2008కి చెందిన వెయ్యి మంది బాధితులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని  కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేశారు.