- సర్కారు బడుల్లో పాఠాలు చెప్పనున్న టీచర్లు
- హైదరాబాద్ జిల్లాలో 584 మంది ఎంపిక
- నేడు కౌన్సిలింగ్ తర్వాత ఆర్డర్స్..
- ఇందులో 386 మంది ఎస్జీటీలే..
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇటీవల అపాయింట్ మెంట్ లెటర్స్అందుకున్న డీఎస్సీ అభ్యర్థులు బుధవారం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో టీచర్కొలువులకు వెళ్లనున్నారు. నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థులకు మంగళవారం కౌన్సిలింగ్ముగిసిన తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్ఇవ్వనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 584 మంది టీచర్లు పోస్టింగ్స్తీసుకోనుండగా, ఇందులో 386 మంది ఎస్జీటీలు, 107 మంది స్కూల్అసిస్టెంట్లు, 91 మంది లాగ్వేజ్పండిట్లు ఉన్నారు. జిల్లాలో 691 స్కూళ్లుండగా లక్షకు పైగానే విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సుమారు 4 వేల మంది టీచర్లు మాత్రమే ఉండడంతో చాలా స్కూళ్లలో అరకొరగా చదువులు సాగుతున్నాయి. ఏండ్ల నుంచి టీచర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో పిల్లలు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతున్నారు. ప్రస్తుతం పోస్టుల భర్తీతో చాలా వరకు ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల లేమి బాధ తప్పనుంది.
878 పోస్టులకు 584 భర్తీ..
హైదరాబాద్జిల్లాలో 878 పోస్టులు ఖాళీ ఉండగా 584 పోస్టులు భర్తీ చేశారు. రిజర్వేషన్లు, కోర్టు కేసులు, సర్టిఫికెట్వెరిఫికేషన్ లో లోపాల వల్ల మరో 294 మంది పోస్టింగులు పెండింగ్లో పడ్డాయి. ఉర్దూ మీడియంలో 185 పోస్టులుండగా, రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులు లేక 82 మందికి మాత్రమే నియామకపత్రాలిచ్చారు. మిగిలిన103 ఉర్ధూ మీడియం పోస్టులను భర్తీ అయినట్లే చూపించారు. పీఈటీ, ఎస్జీటీ, ఎస్ఏ స్పెషల్ఎడ్యుకేషన్ పోస్టులు..స్థానికత, తదితర సమస్యలతో కోర్టులో కేసు ఉండడంతో 159 పోస్టులకు సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేయలేదు. సర్టిఫికెట్వెరిఫికేషన్లో తప్పుల వల్ల మరో 32 మంది పోస్టింగ్స్పెండింగ్లో పడిపోయినట్లు తెలుస్తోంది. వీరందరినీ మినహాయించగా 584 మంది నేడు పోస్టింగ్ ఆర్డర్స్అందుకోనున్నారు.
స్టాన్లీ స్కూల్లో కౌన్సిలింగ్
హైదరాబాద్ సిటీ/ఇబ్రహీంపట్నం/వికారాబాద్, వెలుగు: అపాయింట్మెంట్ లెటర్స్ అందుకున్న అభ్యర్థులకు మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఈవో ఆర్.రోహిణి తెలిపారు. అబిడ్స్ చాపెల్రోడ్లో ఉన్న ఎస్ఎస్సీ బోర్డుకు ఎదురుగా ఉన్న స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో ఉదయం 9 గంటల నుంచి కౌన్సిలింగ్ఉంటుందన్నారు. అభ్యర్థులు తమతో పాటు అపాయింట్ మెంట్ఆర్డర్, రెండు పాస్ పోర్ట్ సైజ్ఫొటోలు, హాల్టికెట్లు తీసుకురావాలని కోరారు. కౌన్సిలింగ్హాల్లోకి అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంగరకలాన్లోని డీఈవో ఆఫీస్లో , వికారాబాద్ జిల్లా అభ్యర్థులకు డీఈవో ఆఫీస్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.