- రెండు సెషన్స్‌లో ఎగ్జామ్
- ఆగస్టు 5 వరకు పరీక్షల నిర్వహణ
- ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతిపై ప్రశ్నలు
హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం 9 నుంచి 11.30 గంటల సెషన్లో తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ (సోషల్, ఫిజికల్ సైన్స్), మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల సెషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ జరిగాయి.
ఈ పరీక్షలకు మొత్తం 19,746 మంది హాజరుకావాల్సి ఉండగా.. 16,221 (82.14%) మంది అటెండ్ అయ్యారు. గురువారం ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు.. వచ్చేనెల 5 వరకు కొనసాగుతాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఉదయం ఏడున్నర నుంచే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. అయితే, ఎగ్జామ్ సెంటర్ల బయట పెద్దగా వసతులు లేకపోవడంతో అభ్యర్థులు, వారితో వచ్చిన పేరెంట్స్, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాగా, శుక్రవారం రెండు సెషన్లలో ఎస్జీటీ తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి. మరోపక్క డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో అభ్యర్థులు పరీక్షలను అడ్డుకుంటారనే ప్రచారంతో సెంటర్ల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పథకాలపై పలు ప్రశ్నలు
డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు నార్మల్‌గానే వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు స్కీములపై ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. అమ్మా ఆదర్శ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్, గృహజ్యోతిపై ప్రశ్నలు అడిగారు. ఈ నెలలో జరిగే ఒలింపిక్స్ క్రీడలు, ఎన్ఈపీపైనా ప్రశ్నలు వచ్చాయి. ప్రధానంగా హైస్కూల్ లెవెల్ లో క్వశ్చన్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు.చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో అభ్యర్థులు పరీక్షలను అడ్డుకుంటారనే ప్రచారంతో సెంటర్ల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ పథకాలపై పలు ప్రశ్నలు
డీఎస్సీ క్వశ్చన్ పేపర్లు నార్మల్‌గానే వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు స్కీములపై ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. అమ్మా ఆదర్శ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్, గృహజ్యోతిపై ప్రశ్నలు అడిగారు. ఈ నెలలో జరిగే ఒలింపిక్స్ క్రీడలు, ఎన్ఈపీపైనా ప్రశ్నలు వచ్చాయి. ప్రధానంగా హైస్కూల్ లెవెల్ లో క్వశ్చన్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు.ఈపీపైనా ప్రశ్నలు వచ్చాయి. ప్రధానంగా హైస్కూల్ లెవెల్ లో క్వశ్చన్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు