నిజామాబాద్, వెలుగు: డీఎస్సీ -2024 లో సెలెక్టయిన తొమ్మిది మంది అభ్యర్థులు పోస్టింగ్ కోసం డీఈవో, కలెక్టర్ ఆఫీస్‌ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సెలెక్షన్ ప్రోసీజర్‌ను రాతపరీక్ష మొదలుకొని అన్ని టెస్టులు ముగించినా పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. సోమవారం కూడా వారు ప్రజావాణిలో కలెక్టర్‌ను కలవడానికి వచ్చారు.
డీఎస్సీ పరీక్ష తర్వాత గత నెల 9న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్నామని మీడియాకు వాటిని చూపారు. లెటర్లు అందుకొని సంతోషంతో తిరిగి వచ్చిన తమకు స్కూల్స్‌లో పోస్టింగ్ ఇవ్వక తిప్పుతున్నారని తెలిపారు. తమతో పాటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు డ్యూటీలో చేరి 25 రోజులు కావస్తోందని తాము అన్యాయానికి గురవుతున్నామన్నారు.