Great: అప్పుడు కానిస్టుబుల్​ అయింది.. ఇప్పుడు ​ పంతులమ్మగా చేరబోతుంది

Great:  అప్పుడు కానిస్టుబుల్​ అయింది.. ఇప్పుడు ​ పంతులమ్మగా చేరబోతుంది
  • స్కూల్​ అసిస్టెంట్, ఎస్‌‌‌‌‌‌‌‌జీటీలోనూ టాపర్​గా మహిళా కానిస్టేబుల్
  • ఆదిలాబాద్​ జిల్లాకు డీఎస్సీ ర్యాంకుల పంట

ఆదిలాబాద్/బెల్లంపల్లి/నేరడిగొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా అభ్యర్థులు సత్తా చాటారు. బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో మహిళా కానిస్టేబుల్‌‌‌‌‌‌‌‌గా చేస్తున్న వీర్ల మౌనిక స్కూల్ అసిస్టెంట్​తోపాటు ఎస్‌‌‌‌‌‌‌‌జీటీ ఫలితాల్లో సత్తా చాటి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. స్కూల్​అసిస్టెంట్​ఎగ్జామ్​లో 75.23 మార్కులు తెచ్చుకున్న మౌనిక..  ఎస్జీటీలో 77.9 మార్కులు సాధించింది. బెల్లంపల్లి మండలం బూదాకుర్డ్ గ్రామానికి చెందిన రైతు వీర్ల మల్లయ్య–వజ్ర దంపతుల కూతురు మౌనిక పట్టుదలతో చదివి 2020లో కానిస్టేబుల్​గా ఉద్యోగం సాధించింది..

స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రైమరీ వరకు, గ్రామంలోని బాల భారతి హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో టెన్త్ చదివిన మౌనిక..  ఆ తర్వాత బెల్లంపల్లి పట్టణంలోని భారతి జూనియర్ కళాశాల‌‌‌‌‌‌‌‌లో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌లో పైచదువులు చదివింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన హాస్టల్​వెల్ఫేర్​ఆఫీసర్​పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోనే సెకండ్​ప్లేస్​లో నిలిచింది. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహం తోనే ఇది సాధ్యమైందని మౌనిక తెలిపారు. 

ఆదిలాబాద్​ జిల్లా టాపర్​గా ప్రవళిక

ఆదిలాబాద్ పట్టణంలోని వన్​ టౌన్​లో హెడ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న గిన్నెల సత్యమోహన్–విజయ దంపతుల కూతురు గిన్నెల ప్రవళిక డీఎస్సీ ఎస్జీటీ ఫలితాల్లో సత్తా చాటింది. టెట్​లో150కి గానూ 139 మార్కులు సాధించి టాపర్​గా నిలిచిన ప్రవళిక.. ఎస్జీటీలో 83.53 మార్కులు తెచ్చుకొని జిల్లాలో ఫస్ట్​ ప్లేస్​సాధించింది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

 పేదింటి బిడ్డకు 4వ ర్యాంకు

నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన చొక్కపల్లి శివకృష్ణ ఎస్జీటీ విభాగంలో జిల్లా స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. వడ్రంగి పనులు చేసే చొక్కపల్లి శంకర్–లలిత దంపతుల కొడుకు శివకృష్ణ టెన్త్ వరకు స్థానిక జడ్పీ హైస్కూల్ లో, ఇంటర్ నిర్మల్ జిల్లాలోని దీక్ష జూనియర్ కాలేజీలో, టీటీసీ ఆదిలాబాద్ లోని డైట్ కాలేజీలో చదివాడు. పేదరికంలో మగ్గుతూ, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారినా శివకృష్ణను కష్టపడి చదివించారు.