
సిద్దిపేట రూరల్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేర మోసాలకు పాల్పడ్డారని, ఇప్పుడైనా పేద దళిత యువతకు, అర్హులైన వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్‌లు మంజూరు చేయాలని డీఎస్పీ జిల్లా అధ్యక్షులు రవిబాబు కోరారు. అర్హులైన వారికే పధకాలను అందజేయాలని కోరుతూ బుధవారం కార్పొరేషన్ ఈడీ శ్రీరామ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దళితబంధులో ఒక్కొక్కరి నుంచి రూ. 2 నుంచి 3 లక్షల వరకు కమిషన్లు తీసుకుని నాయకులు, అధికారులు పంచుకున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సురేష్, యాదగిరి, అనిల్, దీపక్ పాల్గొన్నారు.