యువత బెట్టింగ్ వైపు వెళ్లొద్దు : డీఎస్పీ ప్రసన్నకుమార్ 

యువత బెట్టింగ్ వైపు వెళ్లొద్దు : డీఎస్పీ ప్రసన్నకుమార్ 

పాపన్నపేట, వెలుగు: యువత బెట్టింగ్, ఆన్​లైన్ యాప్ ల బారిన పడి భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. సైబర్ నేరాలు, బెట్టింగ్ ల వల్ల కలిగే అనర్థాలపై బుధవారం పాపన్నపేటలో అవగాహన కల్పించారు. అనంతరం పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్​కు వచ్చే మోసపూరిత లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తులకు నగదు బదిలీ చేయవద్దన్నారు.

యువకులు బెట్టింగ్ యాప్ ల బారిన పడి మోసపోవద్దని, వీటివల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల  కదలికలను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సెంట్రల్ ఎక్విప్​మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వెబ్ పోర్టల్ ద్వారా 22 సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించారు. ప్రజలు తమ ఫోన్ ఐఎంఈఐ నంబర్లను సురక్షితంగా భద్రపరుచుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పీఎస్​లో ఫిర్యాదు చేయాలన్నారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, పోలీసు సిబ్బందిని డీఎస్పీని అభినందించారు.