బార్డర్ చెక్ పోస్ట్ వద్ద నిఘా పెంచాలి : రాజ శేఖర్ రాజు

మిర్యాలగూడ, వెలుగు : తెలంగాణ – ఏపీ బార్డర్ వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద నిఘా పెంచి పీడీఎస్, గంజాయి, ఇతర అక్రమ రవాణాల పై నిఘా వేసి పట్టుకొని అక్రమార్కుల పై కేసులు నమోదు చేయాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజ శేఖర్ రాజు ఆదేశించారు. శనివారం దామరచర్ల మండలం వాడపల్లి పీఎస్ తో పాటు బార్డర్ చెక్ పోస్ట్ ను సందర్శించారు. 

యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ వద్ద చేరుకొని ఈ నెల 20న వైటీ పీఎస్ పై ప్రజాభిప్రాయ సేకరణ ఆంశం పై చర్చించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఆయన వెంట రూరల్ సీఐ కట్టేకోల వీరబాబు సహా ఇతర స్టాఫ్ ఉన్నారు.