
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థినులు 250 మందికి బుధవారం డీఎస్పీ రవీందర్ జీకే బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు స్కూల్స్థాయి నుంచి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి, జనరల్నాలెడ్జికి ఈ బుక్స్ ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ సాయిబాబా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.