పినపాక, వెలుగు : మావోయిష్టుల కదలికలపై, గోదావరి వరద ముంపు ప్రాంతాలపై పోలీసులు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలని మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి సూచించారు. మండలంలోని ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజాసమస్యల పట్ల పారదర్శకంగా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పోలీసులకు సూచించారు.
అనంతరం మండలంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాలైన రావిగూడెం, భూపతిరావుపేట గ్రామాలను సందర్శించారు. గోదావరి వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్సై రాజకుమార్ ఉన్నారు.