భూపాలపల్లి అర్బన్, వెలుగు: భూపాలపల్లి సబ్ డివిజన్లోని ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న 38 మంది బాధితులకు మంగళవారం భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు వారి మొబైల్స్ అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ లో నమోదైన కేసులను ట్రేస్చేసి ఫోన్లను పట్టుకుని 38 మంది బాధితులకు అప్పగించినట్లు తెలిపారు.
కాగా, మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా భూపాలపల్లి డీఎస్పీ, సీఐ నరేశ్ కుమార్, ఎస్సై సుధాకర్ సిబ్బందితో కలిసి మండల పరిధిలోని పంది పంపుల గ్రామంలో తనిఖీలు నిర్వహించారు.