రాత్రి పదకొండు తర్వాత బయట తిరిగితే కేసులే : వంగ రవీంద్ర రెడ్డి

మెట్ పల్లి, వెలుగు : యువకులు రాత్రి సమయంలో బయట కనబడితే చర్యలు తప్పవని మెట్ పల్లి డీఎస్పీ రవీంద్రారెడ్డి హెచ్చరించారు. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై చిరంజీవి తో కలిసి గురువారం రాత్రి స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు. 

యువత మద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాగి బైకులు నడుపుతున్న ఎనిమిదిమందిని, జులాయిగా తిరుగుతున్న 60 మందిని పట్టుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి బయట తిరిగితే   చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో సీఐ లక్ష్మీనారాయణ ఉన్నారు.