పాల్వంచ, వెలుగు : విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని పాల్వంచ డీఎస్పీ కె.వెంకటేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పాల్వంచలోని కేఎస్ఎం ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కు ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు, జూని యర్, డిగ్రీ కళాశాలల్లో ర్యాగింగ్ కారణంగా అనేక మంది స్టూడెంట్స్ ప్రాణాలు తీసుకున్నారని తెలిపారు. జూనియర్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలోఅర్బన్ ఎస్సై రాఘవయ్య, షీ టీం ఎస్ఐ రమాదేవి, వి శ్రీనివాసరావు, కాలేజ్ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు.